
కార్యకర్తలే పార్టీకి బలం
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన శక్తి అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీగార్డెన్స్‌లో జరిగిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను బలంగా ఉండడానికి కారణం క్షేత్రస్థాయిలో తన కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలేనని, వారి కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన నాయకులకు తన అండదండలు ఎప్పటికీ ఉంటాయన్నారు. బీఆర్‌ఎస్, టీడీపీ హయాంలో మెజార్టీ సీట్లు గెలిచినట్లుగానే రాబోయే ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యకం చేశారు. ఈ సమావేశంలో నాయకులు బండ శంకర్, తాటిపర్తి విజయలక్ష్మి, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, ధర రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.