రైలు నుంచిపడి వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచిపడి వ్యక్తికి గాయాలు

Oct 9 2025 2:57 AM | Updated on Oct 9 2025 2:57 AM

రైలు నుంచిపడి   వ్యక్తికి గాయాలు

రైలు నుంచిపడి వ్యక్తికి గాయాలు

రామగుండం: కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో సుమిత్‌గుప్తా అనే ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్‌పై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. కరీంనగర్‌ నుంచి రామగుండం వైపు వస్తున్న పుష్‌పుల్‌ రైలులో సుమిత్‌గుప్తా వస్తున్నాడు. స్థానిక రైల్వేస్టేషన్‌లో రైలు ఆగింది. ఆ తర్వాత కదులుతున్న క్రమంలో సుమిత్‌గుప్తా దిగే ప్రయత్నం చేసి ప్లాట్‌ఫారంపై పడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేశామని జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement