
‘భూభారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి
జగిత్యాల: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో సమీక్షించారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో తేడా ఉన్న సర్వేనంబర్లపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. సాదాబైనామా కేసులు పరిష్కరించాలని, అసైన్డ్ కేసుల్లో ఎంకై ్వరీ పూర్తి చేసి కోర్టు కేసుల్లో ఉన్న భూములపై కౌంటర్ దాఖలు చేయాలన్నారు. భూసేకరణకు తొందరగా అవార్డు చేయాలన్నారు.
దరఖాస్తులు పరిశీలించాలి
మల్యాల: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. స్తానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం సిబ్బంది, జీపీలతో సమావేశమయ్యారు. జీపీఓల బాధ్యతలు, విధులపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ అనంద్‌కుమార్, ఆర్‌ఐ శ్రీనివాస్, జమున తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్