
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మెట్‌పల్లిరూరల్: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అధికారంలోకొచ్చిన 22నెలల్లో చేసిందేమీలేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో బుధవారం పర్యటించారు. ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ బాకీకార్డులు అందించారు. కాంగ్రెస్ హామీలు, మోసం, నయవంచనను ప్రజలకు వివరించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు బండ రాజేందర్, మురళి పాల్గొన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్