
ఈవీఎం గోదాముల పరిశీలన
జగిత్యాల: ఈవీఎంలు భద్రపర్చిన జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లోగల గోదాములను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. యంత్రాల భద్రత, సీసీకెమెరాల పనితీరును తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీం, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు.
గుండె సంబంధిత వ్యాధులు నిర్ధారణ చేసుకోవాలి
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మాతాశిశు సంక్షేమ కేంద్రంలో హృదయ సంబంధిత వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. 2డీఈకో ద్వారా పరీక్షించి సిద్దిపేటలోని సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో చికిత్స అందిస్తారని వెల్లడించారు. అనంతరం జగిత్యాల మైనార్టీ గురుకులంలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుని నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫ్రీ సీటు సాధించిన విద్యార్థి సురేందర్‌ను అభినందించారు. ప్రిన్సిపల్ మహేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
రాయికల్: రైతుల దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రూ.1800 నుంచి రూ.1900వరకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్‌కుమార్, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సాయికుమార్, మహేందర్, మాజీ కో–ఆప్షన్ మెంబర్ సోహెల్, నాయకులు రాంచంద్రం, వినోద్, రాజేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
మద్యం దుకాణాలకు 25 దరఖాస్తులు
జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకు బుధవారం వరకు 25 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తుదారులు నేరుగా ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించినా.. అధికారులు సలహాలు, సూచనలు ఇస్తారని పేర్కొన్నారు.

ఈవీఎం గోదాముల పరిశీలన

ఈవీఎం గోదాముల పరిశీలన