
ఆర్టీసీకి దసరా బోనాంజ
జగిత్యాలటౌన్: దసరా సందర్భంగా జిల్లా పరిధిలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోల పరిధిలో సంస్థకు కాసుల పంట పండింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల ఏడో తేదీ వరకు (17రోజులపాటు) చేపట్టిన స్పెషల్ ఆపరేషన్స్‌తో జిల్లా ఆర్టీసీకి రూ.10కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపించారు. ఇందులో రూ.4,49,056తో జగిత్యాల డిపో మొదటి స్థానంలో.. రూ.3,72,051 ఆదాయంతో కోరుట్ల డిపో రెండోస్థానంలో.. రూ.2,56,044తో మెట్‌పల్లి డిపో మూడో స్థానంలో నిలిచాయి. మూడు డిపోల పరిధిలో ఉన్న బస్సులు 17లక్షల కిలోమీటర్ల మేర నడిచాయి. మొత్తంగా 19 లక్షల మంది ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చారు. ఇందులో 15లక్షల మంది ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు ఉండటం విశేషం. మూడు డిపోలకు రూ.10 కోట్లకుపైగా ఆదాయం రావడంపై ఆర్టీసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 20 నుంచి ఈనెల ఏడు వరకు ‘స్పెషల్’ బస్సులు
జిల్లా పరిధిలో మూడు బస్ డిపోలు
17లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు
19 లక్షల మంది గమ్యస్థానానికి..
వీరిలో 15లక్షల మంది ‘మహాలక్ష్ములు’
మూడు డిపోల పరిధిలో రూ.10.78 కోట్ల ఆదాయం