
ప్రణాళికతో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి
జగిత్యాలక్రైం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికతో విజయవంతం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించా రు. నేర విచారణ, కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఎన్నికల నియమావళి, అధి కారులు తీసుకోవాల్సిన చర్యలు, నేరాలపై సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియమావళి, ప్రవర్తనపై ప్రతి పోలీసు అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా వేయాలన్నారు. నేరాలు చేసేవారు, నేర స్వభావం కలిగిన వారిని గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ అమరవీరుల ది నోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి 31 వరకు ఫ్లాగ్ డేను ప్రతి స్టేషన్‌లో విధిగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన, గణేశ్, దుర్గామాత, దసరా, బతుకమ్మ పండుగలు ప్రశాంతంగా పూర్తి చేయడంలో పాత్ర వహించిన పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచంధర్, రాములు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్పీ అశోక్‌కుమార్
పాల్గొన్న పోలీసు అధికారులు
నియమావళిపై అవగాహన ఉండాలి
పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి
ఎస్పీ అశోక్ కుమార్

ప్రణాళికతో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి