
భీం స్ఫూర్తితో ఆదివాసీలు ముందుకెళ్లాలి
మల్లాపూర్: ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొమురం భీం అని నాయక్‌పోడ్ (ఆదివాసి) సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మొట్ట సంజీవ్ అన్నారు. కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా మండలంలోని చిట్టాపూర్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీలు, నాయక్‌పోడ్‌లు అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. ఆదివాసీల న్యాయపరమైన హక్కుల సాధనకు.. వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కొమురం భీం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఆదివాసీలు, నాయక్‌పోడ్ కులపెద్దలు బిచ్చల అనిల్, సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.