
కండ్లపెల్లి చెరువుకట్టకు మరమ్మతు చేయండి
జగిత్యాలటౌన్: కుంగిపోయిన కండ్లపెల్లి చెరువు కట్టకు మరమ్మతు చేయించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డిని కోరారు. భారీవర్షాలకు చెరువు కట్ట పది గజాల వరకు కుంగిపోయిందని, దీంతో రైతులు, కండ్లపల్లి, హన్మాజిపేట ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
ప్రజాజీవితంలో బాధ్యతగా ఉండాలి
ప్రజాజీవితంలో ఉన్నవారు అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని జీవన్‌రెడ్డి అన్నారు. మంత్రి అడ్లూరిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఉపసంహరించుకుంటే గౌరవ ప్రదంగా ఉంటుందన్నారు.