జగిత్యాలక్రైం: డీజీపీ శివధర్‌రెడ్డిని మంగళవారం ఎస్పీ అశోక్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్సారెస్పీకి 1.86 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 1.86లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 37 గేట్లను ఎత్తి 2,27,940 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
మద్యం దుకాణాలకు 13 దరఖాస్తులు
జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం దుకాణా లకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఇప్పటి వరకు 13 వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
కూరగాయల పంటలపై అవగాహన
కొడిమ్యాల: మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో మిరప, కూరగాయల సస్యరక్షణ చర్యలు, కాపాస్ కిసాన్ యాప్, పత్తి కొనుగోలుపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. డీఏవో వి.భాస్కర్, ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్, వెటర్నరీ అధికారి రాకేశ్ పాల్గొన్నారు. పూడూరులో అభ్యుదయ రైతు రాంరెడ్డి శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. తిరుమలాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతునేస్తంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం దిష్టిబొమ్మ దహనం
జగిత్యాలటౌన్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు పొన్నం దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
పీఎంశ్రీ పాఠశాలల్లో ల్యాబ్‌లు ప్రారంభం
జగిత్యాల: పాఠశాలల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందని డీఈవో రాము అన్నారు. జిల్లాలోని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలైన కోరుట్ల, మగ్గిడి, ధర్మపురి పాఠశాలలకు అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీ సైన్స్ ల్యాబ్‌లు మంజూరు కాగా.. మంగళవారం వాటిని ప్రారంభించారు. ఈ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు వివిధ అంశాలను త్రీడీగా చూపిస్తూ.. వారిలో లోతైన అవగాహన, కల్పిత ప్రపంచాల అన్వేషణను ప్రోత్సహిస్తాయన్నారు. బయోల జీ చరిత్ర, భౌతికశాస్త్రల్లో నూతన ప్రయోగాలు, ల్యాబ్ అనుకరణలు, వర్చువల్ టూల్స్ ద్వారా విద్యార్థులు సురక్షితంగా అభ్యసించడమే కాకుండా జ్ఞాన సాధన సాధిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
డీజీపీని కలిసిన ఎస్పీ
డీజీపీని కలిసిన ఎస్పీ
డీజీపీని కలిసిన ఎస్పీ
డీజీపీని కలిసిన ఎస్పీ