జగిత్యాలజోన్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు మంగళవారం ఆందోళనకు దిగారు. కోర్టు విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. న్యాయవాదులు బిరుదుల లక్ష్మణ్, ఉమామహేశ్, దిలీప్, కరుణాకర్, పురుషోత్తం, సంతోష్, అక్బర్, రాజన్న, సాయి, కిరణ్ పాల్గొన్నారు.
కోరుట్లలో..
కోరుట్ల: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థకు మంచిది కాదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్‌కుమార్, న్యాయవాదులు ఫసియోద్దీన్, కడకుంట్ల సదాశివ రాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.