
వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం
మల్లాపూర్: వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయమని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచుల నర్సయ్య అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం మండలకేంద్రంతో పాటు వెంకట్రావ్‌టపేలో ఉత్సవాలను ఘ నంగా నిర్వహించారు. బోయ వాల్మీకుల్లో 80శాతం ప్రజలు నిరుపేదలు ఉన్నారని, కొన్నిచోట్ల ఎస్టీలు గా, మరికొన్ని చోట్ల బీసీలుగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్రానికి బిల్లు పంపించినా పెండింగ్‌లో ఉందన్నారు. కార్యక్రమంలో బోయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మీనుగు చంద్రశేఖర్, నాయకులు పెనుకుల మల్లేశ్, పెనుకుల మనోహర్, మీనుగు కొండయ్య, రాజమౌళి, రాజేందర్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.