
‘పరిషత్’ ఏర్పాట్లు ముమ్మరం
కౌంటింగ్ కేంద్రాలు
జగిత్యాల: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడత బీర్‌పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మొదటగా పరిషత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జెడ్పీటీసీ రిజర్వేషన్ వివరాలు ఇలా..
బీర్‌పూర్ (ఎస్టీ జనరల్), ఎండపల్లి, మల్యాల (ఎస్సీ మహిళ), కొడిమ్యాల, గొల్లపల్లి (ఎస్సీ జనరల్), పెగడపల్లి, జగిత్యాల, భీమారం, మేడిపల్లి (బీసీ మహిళ), రాయికల్, కోరుట్ల, వెల్గటూర్, సారంగాపూర్, మెట్‌పల్లి, బుగ్గారం (బీసీ జనరల్), బుగ్గారం, మల్లాపూర్, కథలాపూర్ (జనరల్ మహిళ), ఇబ్రహీంపట్నం, ధర్మపురి, జగిత్యాల రూరల్ (జనరల్)కు కేటాయించారు.
ఎంపీపీ రిజర్వేషన్ల వివరాలు ఇలా..
బీర్‌పూర్ (ఎస్టీ జనరల్), ఎండపల్లి, బుగ్గారం (ఎస్సీ మహిళ), కొడిమ్యాల, మల్యాల (ఎస్సీ జనరల్), రాయికల్, భీమారం, గొల్లపల్లి, కోరుట్ల (బీసీ మహిళ), పెగడపల్లి, జగిత్యాల, మేడిపల్లి, వెల్గటూర్ (బీసీ జనరల్), ధర్మపురి, మెట్‌పల్లి, జగిత్యాలరూరల్ (జనరల్ మహిళ), సారంగాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ (జనరల్) స్థానాలుగా ఖరారయ్యాయి. మొదటి దశ పోలింగ్‌కు ఈనెల 9న నోటిఫికేషన్ రానుండగా.. ఈనెల 23న పోలింగ్, నవంబర్ 11న కౌంటింగ్ చేపట్టనున్నారు. అలాగే రెండో దశకు ఈనెల13న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఈనెల 27న పోలింగ్, నవంబర్ 11 కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ కల్పించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అవగాహన కల్పిస్తున్నారు.
ఫేస్–1 పోలింగ్:
10 జెడ్పీటీసీ, 108 ఎంపీటీసీ స్థానాలు
పోలింగ్ కేంద్రాలు: 554
మండలాలు: బీర్‌పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి
ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో:
జగిత్యాల, జగిత్యాలరూరల్,
కొడిమ్యాల, మల్యాల, ధర్మపురి, బుగ్గారం
కండ్లపల్లి మోడల్‌స్కూల్‌లో:
రాయికల్, సారంగాపూర్, బీర్‌పూర్
ఇబ్రహీంపట్నం మోడల్‌స్కూల్‌లో
మల్లాపూర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం
కల్లూరు మోడల్‌స్కూల్‌లో
కోరుట్ల, భీమారం, మేడిపల్లి
గొల్లపల్లి మోడల్‌స్కూల్‌లో: గొల్లపల్లి,
పెగడపల్లి, వెల్గటూర్, ఎండపల్లి
ఫేస్–2 పోలింగ్
10 జెడ్పీటీసీ, 108 ఎంపీటీసీ స్థానాలు
పోలింగ్ కేంద్రాలు: 569
మండలాలు: బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి
ఫేస్–1
నోటిఫికేషన్ విడుదల:
9న
పోలింగ్: అక్టోబర్
23
కౌంటింగ్: నవంబర్ 11
ఫేస్–2
నోటిఫికేషన్ విడుదల: 13న
పోలింగ్ : అక్టోబర్
27
కౌంటింగ్ : నవంబర్ 11