
‘బెస్ట్ అవెలబుల్’ విద్యార్థుల ఆందోళన
జగిత్యాలటౌన్: చదువుకునేందుకు తమను పాఠశాలలోకి అనుమతించడం లేదంటూ బెస్ట్ అవెలబుల్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు జిల్లాకేంద్రంలో ని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద జగి త్యాల, కరీంనగర్ రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. బెస్ట్ అవెలబుల్ స్కూళ్లుగా గుర్తించిన కొ న్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాల్సి ఉంది. రెండేళ్లుగా నిధులు విడుదలకాకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను క్లాసులకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించారు. అక్కడ కాసేపు నిరసన తెలిపారు. అనంతరం రహదారిపై బైటాయించారు. బకాయిలు విడుదల చేసి పిల్లల విద్యాభ్యాసం నిలిచిపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ ఎస్సై మల్లేశం వారికి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.