మంత్రి ‘పొన్నం’ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

మంత్రి ‘పొన్నం’ క్షమాపణ చెప్పాలి

Oct 7 2025 4:25 AM | Updated on Oct 7 2025 3:49 PM

జగిత్యాలటౌన్‌/ధర్మపురి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్షమాపణ చెప్పాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతీసేలా సహచర మంత్రి అడ్లూరిని కించపరిచేలా పొన్నం మాట్లాడడం సరికాదన్నారు. 24గంటల్లో క్షమాపణ చెప్పకుంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పొన్నం దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు. ధర్మపురి ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు చెందోలి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరించిన పొన్నం తీరు సరికాదన్నారు.

దుర్భాషలాడిన వారిపై చర్యలు తీసుకోండి

జగిత్యాల: ఆస్పత్రుల్లో వైద్యులపై కొందరు చికిత్స కోసం వచ్చి దుర్భాషలాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌కు ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్‌ సభ్యులు వినతిపత్రం అందించారు. మల్లాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై అనుచితంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్నారు. ఈ ఘటనలతో వైద్య సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారన్నారు. వైద్యులు శశికాంత్‌రెడ్డి, నవీన్‌, అమరేందర్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలకు రక్షణ కరువైంది

జగిత్యాలటౌన్‌: జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు రక్షణ కరువైందని, పోలీస్‌ యంత్రాంగమే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. బాలెపల్లి రేవంత్‌రెడ్డిపై గంగారెడ్డి అనుచరులు రాళ్లతో దాడులు చేయగా.. కార్తీక్‌ అనే మధ్యవర్తికి తగిలిందని, రేవంత్‌రెడ్డిపై దాడి చేస్తున్నారని, శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రేవంత్‌రెడ్డినే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం దారుణమన్నారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ, సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

కోరుట్ల నుంచి వేములవాడకు టికెట్‌ ధర రూ.60

ఆర్టీసీలో రెట్టింపు చార్జీ వసూలు

కథలాపూర్‌: కోరుట్ల నుంచి వేములవాడకు ఆర్టీసీ బస్‌ చార్జి రూ.60. కానీ.. కోరుట్ల డిపోకు చెందిన ఓ బస్‌ కండక్టర్‌ మండలంలోని సిరికొండకు చెందిన ప్రయాణికుడు గుండేటి రాజు నుంచి రూ.120 తీసుకున్నారు. ఇదేమిటని అడిగితే కోరుట్ల డిపో అధికారులు చెప్పడంతోనే తాను వసూలు చేస్తున్నట్లు కరాఖండీగా చెప్పాడు. రాజుతోపాటు ప్రయాణికులు వారించినా వినిపించుకోలేదు. విషయాన్ని రాజు కోరుట్ల డిపో అధికారులకు ఫోన్‌లో తెలపగా.. పొంతనలేని సమాధానమిచ్చారు. రాజు తిరుగు ప్రయాణంలో వేములవాడ నుంచి సిరికొండకు వేములవాడ డిపో బస్సులో వెళ్లగా కండక్టర్‌ మాత్రం రూ.60 తీసుకున్నాడు. రెట్టింపు చార్జి వసూలుపై కోరుట్ల ఆర్టీసీ డిపో అధికారులను వివరణ కోరగా.. ఒక బస్సు ట్రిప్పులో ఎక్కువ ధర తీసుకున్న మాట నిజమేనని, మిగిలిన బస్సుల్లో పెంచలేదని తెలిపారు.

మంత్రి ‘పొన్నం’  క్షమాపణ చెప్పాలి1
1/2

మంత్రి ‘పొన్నం’ క్షమాపణ చెప్పాలి

ఆర్టీసీలో రెట్టింపు చార్జీ వసూలు2
2/2

ఆర్టీసీలో రెట్టింపు చార్జీ వసూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement