
ఎన్నికల్లో లోటుపాట్లు రానీయొద్దు
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో లోటుపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో నామినేషన్ల స్వీకరణపై ఆర్వో, ఏఆర్వోలకు అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు తీసుకోవాలని, ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అధికారులు, ఆర్వో, ఏఆర్వోలు పాల్గొన్నారు.
కారిడార్ అభివృద్ధికి డీపీఆర్ చేపట్టాలి: స్పెషల్ చీఫ్ సెక్రటరీ
గ్రీన్‌ఫీల్డ్ నాగ్‌పూర్, హైదరాబాద్ హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) చేపట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌తో సమీక్షించారు. జాతీయ రహదారుల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి డీపీఆర్ తయారుచేయాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో కొంతమేర కారిడార్ ఉన్న నేపథ్యంలో దాని ప్రకారం చేపడతామన్నారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఉన్నారు.