
యువత స్వయం ఉపాధి సమాజానికి మేలు
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: యువత స్వయం ఉపాధితో ముందుకెళ్లాలని, అది సమాజానికి మేలు అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాలకు చెందిన యువత అన్ని రకాల వస్తువులు ఆన్‌లైన్ ద్వారా డెలివరీ చేసేలా ఇటీవల జిపాక్ యాప్ రూపొందించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. యువత ఇలాంటివి ఆవిష్కరించాలన్నారు. అనంతరం సారంగాపూర్ మండలం అర్పపల్లికి చెందిన ప్రతిభ డీఎస్పీగా ఎంపికై న సందర్భంగా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిభ డీఎస్పీ పోస్టు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ధరూర్ క్యాంప్‌లోని ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రోటరీ క్లబ్, ఆపి సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్యూరీఫైర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు.
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
కథలాపూర్: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. మండలంలోని సిరికొండలో నిర్వహించిన మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాను అధిష్టానానికి పంపించామన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు ఎండీ.అజీమ్, తొట్ల అంజయ్య, చెదలు సత్యనా రాయణ, ఎండీ.హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

యువత స్వయం ఉపాధి సమాజానికి మేలు