
‘సద్దుల’ సందడి
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం మార్కెట్‌లో సందడి నెలకొంది. గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, కలువ పూలు, పండ్లు, రంగుల కొనుగోలులో మహిళలు బిజీబిజీ అయ్యారు. అలాగే బతుకమ్మల నిమజ్జనం కోసం జగిత్యాల బల్దియా యంత్రాంగం 18 చోట్ల ఘాట్లు ఏర్పాటు చేసింది. రామాలయం, బసవేశ్వర కూడలి, పొన్నాల గార్డెన్స్, లింగంపేట చెరువు, ధర్మసముద్రం, వీక్లీబజార్ స్కూల్ సమీపంలో, చిలుకవాడ, గొల్లపల్లి రోడ్, కండ్లపల్లి చెరువు, శంకులపల్లి చౌరస్తా, ముప్పారపు చెరువు వద్ద రెండు ఘాట్ల చొప్పున ఏర్పాట్లు చేశారు. ఘాట్ల వద్ద లైటింగ్ తదితర సదుపాయాలు కల్పించారు. – జగిత్యాలటౌన్

‘సద్దుల’ సందడి