
సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్ల కొనసాగింపు
కథలాపూర్: భూషణరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లోక బాపురెడ్డితోపాటు 9 మంది డైరెక్టర్లను యధావిధిగా పదవుల్లో కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. సహకార సంఘాల పాలకవర్గం గడువు గత నెలలో ముగియడంతో కొన్ని సంఘాలకు పర్సన్ ఇన్‌చార్జీలను నియమించారు. మరికొన్ని పాలకవర్గాలను యధావిధిగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అన్నింటికి ఒకేసారి ఎన్నికలు జరగగా.. కొన్నింటిపై వివక్ష చూపించడంపై నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. భూషణరావుపేట సహకార సంఘం చైర్మన్ లోక బాపురెడ్డి, వైస్ చైర్‌పర్సన్ మిట్టపెల్లి లక్ష్మి, ఏడుగురు డైరెక్టర్లు యధావిధిగా పదవుల్లో కొనసాగుతారన్నారు.