
ఐలమ్మకు నివాళి
జగిత్యాల రూరల్: నివాళి అర్పిస్తున్న ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ
జగిత్యాల టౌన్: ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న అధికారులు
జగిత్యాల టౌన్: నివాళి అర్పిస్తున్న మంత్రి అడ్లూరి, జీవన్‌రెడ్డి
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల చింతకుంట చెరువు మినీ ట్యాంక్‌బండ్ వద్దగల ఐలమ్మ విగ్రహానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈతరం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని వారు సూచించారు. ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బండ శంకర్, రజక సంఘం ప్రతినిధులు గుండారపు రవీందర్, సట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత నివాళి అర్పించారు. ఆమె పోరాటాన్ని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సునీత, డీపీవో మదన్‌మోహన్, మెప్మా పీడీ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ నివాళి అర్పించారు. వీరనారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో శశికళ, ఆర్‌ఐలు కిరణ్‌కుమార్, వేణు, సైదులు, డీపీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– జగిత్యాలటౌన్/జగిత్యాల క్రైం