
యాదాద్రి జిల్లాలో గొర్రెల చోరీ
శంకరపట్నం: యాదాద్రి భువనగిరి జిల్లాలో చోరీకి గురైన గొర్రెలను మంగళవారం వేకువజామున మొలంగూరులో పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిరోజుల క్రితం 10 గొర్రెలు చోరీకి గురయ్యాయి. అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణలో భాగంగా చోరీకి గురైన గొర్రెలు శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులోని మైదానం ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడి పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో ట్రాలీఆటోలో గొర్రెలను తీసుకెళ్లారు. గొర్రెల దొంగలు మండలానికి చెందిన వ్యక్తులుగా ప్రచారం జరుగుతోంది.
మొలంగూర్‌లో పట్టివేత