
పట్టపగలే చోరీ
ఇల్లందకుంట: ఇంటి యజమాని ఆరుబయట ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని మల్యాల గ్రామ పంచాయతీ పరిధి గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గూడెపు మల్లమ్మ ఇంటి ఆరుబయట పడుకొని ఉండగా పక్కన ఉన్న రూం కిటికీలు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయని, అందులోని రూ.2.5 లక్షలు దొంగిలించారని మల్లమ్మ ఫిర్యాదు చేసిందని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టామని సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై క్రాంతికుమార్ వివరించారు.