
మూతపడిన మహిళా క్యాంటీన్
జగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మహిళా క్యాంటీన్ మూతపడింది. రెండో అంతస్తులో మహిళా క్యాంటీన్ కోసం ఒక గది, హాల్ కేటాయించారు. ఉద్యోగులు, వచ్చిపోయే ప్రజలకు టీ, కాఫీతోపాటు భోజనం పెట్టేవారు. మహిళా సంఘాల సభ్యులు నెలకొకరు మారడం.. నిర్వహణ లేకపోవడంతో మూతపడింది. విశాలమైన గది, హాల్, వంటగది, స్టోర్ రూం ఉన్నా.. వ్యాపారం బాగానే జరిగినా.. అధికారుల నిర్లక్ష్యమో.. మహిళా సంఘాలు పట్టించుకోకపోవడమోగానీ అది మూతపడింది. ఈ విషయమై డీ ఆర్డీఏ పీడీ రఘువరణ్‌ను వివరణ కోరగా.. కొన్ని కారణాలతో తీయడం లేదని, త్వరలో తెరిచేలా చూస్తామని వెల్లడించారు.