
మహిళలకు ఆరోగ్య పరీక్షలు
జగిత్యాల: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కు టుంబం బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ని ర్ణయించింది. ఇందుకోసం స్వస్థ్‌నారీస్వశక్త్ పరి వార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించగా.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. వచ్చేనెల రెండోతేదీ వరకు ప్రతి మహిళకు ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 24 ఆస్పత్రుల్లో 69 మంది స్పెషలిస్ట్‌లతో రోజుకు ఐదు క్యాంపుల చొప్పున మొత్తం 65 శిబిరాలు నిర్వహించి మహిళలకు చికిత్స అందించనున్నారు. మహిళా వైద్యులను నియమించి అవసరమైన రక్త, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీ నింగ్, రక్తహీనత, క్షయవ్యాధి, సికెల్‌సెల్ ఎని మియా వంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఎన్‌టీ, డెంటల్, సైకియాట్రిస్ట్, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లలకూ వైద్యసేవలు అందించనున్నారు.
మహిళలకు మేలు
వైద్య శిబిరాల్లో మహిళలకు వివిధ వైద్య పరీక్షలతోపాటు గర్భిణులు, బాలింతలకు చికిత్స అందించి పోషకాహారంపై వివరించనున్నారు. జిల్లాలో మూడు లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఒక్కోరోజు ఒక్కో ఆస్పత్రిలో శిబిరం ఉండేలా రూపొందించారు. ప్రత్యేక వైద్యులు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది చికిత్స అందించనున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.
ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి
మహిళలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. స్వస్థ్ నారి స్వశక్తి పరివార్ శిబిరాన్ని ఖిలాగడ్డలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. ఉప్పు, చక్కెర వాడకాన్ని తగ్గించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ శిబిరాలను వినియోగించుకోవాలన్నారు. ఈఎన్‌టీ వైద్యులు శ్వేత, సంతోష్, ఆర్‌బీఎస్‌కే వైద్యులు సురేందర్ పాల్గొన్నారు.
టెక్నికల్ కోర్సుతో విద్యార్థులకు భవిష్యత్
టెక్నికల్ కోర్సులతో విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. యువత టెక్నికల్ కోర్సులు నేర్చుకుని నిలదొక్కుకోవాలన్నారు.
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది
జగిత్యాలరూరల్: ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్‌స్కూల్ టీచర్ చిలుకూరి శివకృష్ణను సన్మానించారు.