రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక

Sep 19 2025 1:47 AM | Updated on Sep 19 2025 1:47 AM

రేపు

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక

జగిత్యాలజోన్‌: హైకోర్టు న్యాయమూర్తి రేణుక యా ర శనివారం జిల్లాకు రానున్నారు. కోర్టులో జరిగే జ్యు డిషియల్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రేణుక ప్రస్తుతం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అన్ని కో ర్టుల జ్యుడిషియల్‌ ఆఫీసర్స్‌ పాల్గొననున్నారు.

పరిశుభ్రతలో భాగస్వామ్యం కండి

మెట్‌పల్లి: పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మెట్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌ అన్నారు. పట్టణంలో స్వచ్ఛోత్సవ్‌–స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతపై గురువారం అవగాహన కల్పించారు. ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని, మురికి కాలువలు, రహదారులపై వేయొద్దని సూచించారు. చుట్టు పక్కన గ్రామాల నుంచి వచ్చే వారు పబ్లిక్‌ టాయిలెట్స్‌ను వినియోగించుకోవాలన్నారు. ఆశ కార్యకర్తలు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అల్లీపూర్‌ విద్యార్థి

రాయికల్‌: మండలంలోని అల్లీపూర్‌ జెడ్పీ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి సీహెచ్‌.మనోజ్‌ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ కబడ్డీ పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. మనోజ్‌ను ప్రిన్సిపల్‌ పొరండ్ల కిరణ్‌ అభినందించారు.

ఎస్జీఎఫ్‌ క్రీడా పోటీలు ప్రారంభం

జగిత్యాలటౌన్‌: జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో 69వ ఎస్జీఎఫ్‌ అండర్‌–19 క్రీడాపోటీలు గురువారం ప్రారంభయ్యాయి. డీఐఈవో నారాయణ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. నిఖత్‌జరీన్‌, సిరాజ్‌, దీప్తి వంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని కోరారు. దాదాపు 260మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పీడీలు, కోచ్‌లు సరిత, రాజశేఖర్‌, శ్రీనివాస్‌, రాజేందర్‌, సంతోష్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

నాణ్యతలేకనే దుంపేట చెరువుకు గండి

కథలాపూర్‌: అధికారుల నిర్లక్ష్యం, నాణ్యతలేని పనులతోనే మండలంలోని దుంపేట చెరువుకు గండి పడిందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, మండల అధ్యక్షుడు మల్యాల మారుతి అన్నారు. గండిపడిన చెరువు వద్ద గురువారం నిరసన తెలిపారు. చెరువుకు ఇప్పటికి మూడుసార్లు గండిపడి రైతులు, మత్స్యకారులకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గండితో 80 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిన ట్లు దుంపేట, దూలూర్‌ రైతులు తెలిపారు. బీజేపీ నాయకులు దండిక లింగం, కథలాపూర్‌ మహేశ్‌, గడ్డం జీవన్‌రెడ్డి, నరెడ్ల రవీందర్‌రెడ్డి, కాసోజి ప్రతాప్‌ పాల్గొన్నారు. చెరువును తహసీల్దార్‌ వినోద్‌, నీటిపారుదలశాఖ డీఈ ప్రశాంత్‌, ఏఈ నవీన్‌, రాజు పరిశీలించారు.

మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి

జగిత్యాల: మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఈవో రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ భవన్‌లో మాట్లాడారు. అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే సమూలంగా నిర్మూలించవచ్చన్నారు. ప్రజల స్వచ్ఛంద సంస్థ విద్యా పరిశోదన శిక్షణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ చంద్రయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక1
1/4

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక2
2/4

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక3
3/4

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక4
4/4

రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement