
‘ఇందిరమ్మ ఇళ్ల’ను వేగవంతం చేయాలి
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగం పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మండలంలోని యామపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లు, పాఠశాలలో కిచెన్ షెడ్, తిమ్మాపూర్ తండాలో గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులకు సూచించారు. పాత పోలీస్‌స్టేషన్ వద్ద నిర్మిస్తున్న పంచాయతీ భవనాన్ని పరిశీలించి మూడు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస్, పీఆర్‌ఈఈ లక్ష్మణ్‌రావు, డీఈ రమణారెడ్డి, ఏఈ అభినవ్, హౌసింగ్ ఈఈ వాసం ప్రసాద్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో మహ్మద్ సలీం, ఎంపీవో రామకృష్ణరాజు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు స్వాగతం పలికిన చిన్నారులు
యామపూర్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఏం చదువుతున్నారు..? మధ్యాహ్న భోజనం పెడుతున్నారా..? కోడిగుడ్డు ఇస్తున్నారా..? అన్నం రుచికరంగా ఉందా..? అని అడిగి తెలుసుకున్నారు.
తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులు..
జగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులేనని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో దివ్యాంగులు, వయోవృద్ధుల కమిటీలతో సమావేశమయ్యారు. తల్లిదండ్రులను విస్మరించే కొడుకులు, కోడళ్లు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులు కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులకు సత్వర న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని సంక్రాంతికి ప్రారంభిస్తామన్నారు. దివ్యాంగులకు బస్సు, రైల్వే పాసుల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.