
మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని లెక్చరర్‌కాలనీలో నివాసం ఉండే దిడ్డి శ్రీదేవి(53) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. మనస్తాపంతో భర్త దిడ్డి సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. టౌన్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. దిడ్డి శ్రీదేవి – దిడ్డి సుధాకర్‌కు కొన్నేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఆదర్స్, కూతురు సింధూ ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే, ‘మీ అక్క చనిపోయి ఉంద’ని సుధాకర్ ఫోన్‌ద్వారా ఆమె సోదరుడు పోరండ్ల శ్రావణ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం అందించాడు. ఆ వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్న శ్రావణ్.. సోఫాలో పడుకొని మృతి చెందిన తన అక్కను చూసి రోదించాడు. తన కూతురుకు అనారోగ్యం లేదని, బాధపడేంత ఇతర కారణాలు కూడా ఏమీలేవని, ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి తిరుపతమ్మ వాపోయింది. మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదుచేశారు.
భర్త సుధాకర్ ఆత్మహత్యాయత్నం..
శ్రీదేవి చనిపోవడంతో మనస్తాపం చెందిన సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తన భార్య శ్రీదేవి సోపాలో పడుకుని గుండెపోటుతో మృతి చెందిందని, ఆమె మృతిని తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించానని సుధాకర్ వెల్లడించాడు. మరోవైపు.. తన తల్లి మృతి చెందిందనే సమాచారంతో అమెరికాలో ఉంటున్న కుమారుడు ఆదర్స్ వెంటనే ఇండియా బయలుదేరినట్లు బంధువులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి