
ఎస్సారెస్పీ 36 గేట్లు ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో, ప్రాజెక్టు నుంచి 36 గేట్లను ఎత్తి 2,32,128 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.39 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 2.48 లక్షల క్యూసెక్కులు ఔట్‌ఫ్లో వెళ్తోంది. వరద కాల్వకు 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కెనాల్‌కు 800 క్యూసెక్కులు, లక్ష్మి కెనాల్‌కు 200 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 180 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఘాట్లను తాకిన గోదారమ్మ
ధర్మపురి: కొద్ది రోజుల పాటు శాంతించిన గోదా వరి నది మంగళవారం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎస్సారెస్పీ నుంచి వరద వస్తుండడంతో ధర్మపరి, రాయపట్నం వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. సంతోషిమాత, మంగలిగడ్డ పుష్కరఘాట్లపైకి చేరింది. పిండ ప్రదానాలు చేసే షెడ్డు 50శాతం నీటిలో మునిగింది. భక్తులు స్నానాలకోసం లోనికి వెళ్లకుండా పోలీసు, మున్సిపల్‌శాఖలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఎస్సారెస్పీ 36 గేట్లు ఎత్తివేత