
పశుపోషణపై దృష్టి సారించాలి
జగిత్యాలరూరల్: పశుపోషణపై రైతులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో రూ.10లక్షలతో నిర్మించనున్న పశువైద్య భవనానికి సోమవారం భూమిపూజ చేశారు. పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లోనే వైద్యం అందించేలా వైద్యశాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అన్ని రకాల వ్యాక్సినేషన్, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. పశువైద్యశాఖ ఏడీ నరేశ్, డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాలాచారి, హిమజ, నాయకులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
జగిత్యాల: డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేసి అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కలిసి కోరారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల సాకారం అయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు.