
రోడ్డు మరమ్మతు చేయించండి
ఇటీవల కురిసిన వర్షాలకు జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌లోని రామాలయం, పంట పొలాల వైపు వెళ్లే దారి పూర్తిగా చెడిపోయింది. రామాలయం వెళ్లే భక్తులు, పొలాలకు వెళ్లే రైతులం ఇబ్బంది పడుతున్నాం. దారికి మరమ్మతు చేయించి ఆదుకోండి.
– చల్‌గల్ గ్రామస్తులు
వ్యాపారాలు సాగేలా చూడాలి
జగిత్యాల కూరగాయల మార్కెట్లో 50 ఏళ్లుగా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వ్యాపారాలు చేసుకుంటున్నం. ఇటీవల కొందరు మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాంటి వారి నుంచి మాకు రక్షణ కల్పించండి.
– మార్కెట్ డెలీ వెండర్స్

రోడ్డు మరమ్మతు చేయించండి