
మహిళాశక్తి చీరెల నిల్వకు ఐదు స్టాక్ పాయింట్లు
జగిత్యాలజోన్: ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కోసం ఐదు స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేశామని డీఆర్‌డీఏ రఘువరణ్ అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళాసంఘాల సభ్యులకు అందించే చీరెలను నిల్వ చేసేందుకు గోదాంను బుధవారం పరిశీలించారు. జిల్లాకేంద్రంలో నాక్ కేంద్రం, మెప్మా సమావేశ మందిరం, కోరుట్లలో సీ్త్రశక్తి భవనం, మెప్మా సమావేశ మందిరం, మరోచోట చీరలు నిల్వ చేస్తామన్నారు. జిల్లాలోని 20,886 స్వశక్తి సంఘాల్లోని 2.39 లక్షల మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ ఏపీడీ సునీత, మెప్మా ఏవో శ్రీనివాస్, సెర్ప్ డీపీఎంలు రమేశ్, నారాయణ, నాగేశ్వర్ రావు, ఏపీఎంలు గంగాధర్, దేవరాజ్, సమత పాల్గొన్నారు.