
పోరాట యోధురాలు ఐలమ్మ
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలటౌన్: తెలంగాణ రైతాంగ పోరాటంలో భూస్వాములపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ గొప్ప యోధురాలు అని కలెక్టర్ సత్యప్రసాద్ కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణలో తొలి మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా ప్రభుత్వం ఆమె పోరాటాలను గౌరవించిందన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, డీఆర్‌డీవో రఘువరణ్, మెప్మా పీడీ శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాంసాగర్ ఎనిమిది గేట్లు ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో బుధవారం ఎనిమిది గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 54,545 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. గేట్ల ద్వారా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. అలాగే వరదకాలువకు 19వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5500, ఏస్కేప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కెనాల్‌కు 800, లక్ష్మికెనాల్‌కు 200, అలీసాగర్ ఎత్తిపోతలకు 360, గుత్పా ఎత్తి పోతలకు 270, మిషన్ భగీరథకు 231 కూసెక్కుల చొప్పున వదులుతున్నారు.
విధుల్లో చేరిన జీపీవోలు
జగిత్యాల: గ్రామ పాలన అధికారులు విధుల్లో చేరారు. వీరికి మంగళవారమే కౌన్సెలింగ్ పూర్తి కాగా.. బుధవారం నియామక పత్రాలు అందించారు. సొంత నియోజకవర్గాల్లో చాన్స్ లేకపోవడంతో కేటాయించిన గ్రామాలకు వెళ్లారు. దూరప్రాంతాల్లో నియామకం అయిన కొందరు తమకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీసీ ఉమేశ్‌కుమార్ ఉన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగిందని వివరించారు. ఆగస్టు 17 నుంచి 31 వరకు అమెరికా పర్యటన వివరాలను బుధవారం వెల్లడించారు. భిన్న కోర్సులతో నాలుగు పీజీ సెంటర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్‌ఆర్‌ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాలను సందర్శించి విరాళాలు సేకరించడం జరిగిందన్నారు. 8 బంగారు పతకాలతో పాటు రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు తెలిపారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చినట్లు తెలిపారు. నవంబర్ రెండోవారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

పోరాట యోధురాలు ఐలమ్మ

పోరాట యోధురాలు ఐలమ్మ

పోరాట యోధురాలు ఐలమ్మ