కోరుట్లలో గణపతి పల్లకీమోస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
గొల్లపల్లి: వినాయక మండపం వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాలటౌన్/రాయికల్/కోరుట్ల/కోరుట్లరూరల్/ధర్మపురి/గొల్లపల్లి: తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడు శనివారం గంగమ్మ ఒడికి చేరాడు. జగిత్యాల, కోరుట్లలో యువకులు, మహిళలు శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సందేశాత్మక, ఉత్తమ డెకరేషన్ చేసిన శకటాలకు బహుమతులు ప్రదానం చేశారు. బ్రాహ్మణ సంఘం నెలకొల్పిన గణనాథుని పల్లకీని కార్గిల్ చౌక్ వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, తహసీల్దార్ కృష్ణ చైతన్య మోశారు. పెద్దవాగులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ సురేష్ బాబు, ఎస్సైలు చిరంజీవి, రాంచంద్రం, ఎస్సైలు, అదనపు ఎస్సైలు, పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మెట్‌పల్లి పట్టణంలో మధ్యాహ్నం నుంచే వట్టివాగులో నిమజ్జనం మొదలైంది. సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, కమిషనర్ మోహన్ ఉత్సవాన్ని పర్యవేక్షించారు. ధర్మపురిలో మంత్రి అడ్లూరి గణనాథులకు పూజలు చేశారు. గోదావరిలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆంగ్లోవేదిక్ పాఠశాల విద్యార్థి సింహరాజు మణిద్వీప్ తమకు ఇల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మంత్రి కోరగా హామీ ఇచ్చారు. అనంతరం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో మహంకాళిసేన ప్రతిష్ఠించిన గణనాథున్ని మంత్రి దర్శించుకున్నారు.
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్యా