
విద్యుత్‌షాక్‌తో ఆటో డ్రైవర్ మృతి
శంకరపట్నం: మండలంలోని వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేశ్(28) విద్యుత్‌షాక్‌తో మరణించినట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రాకేశ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం ఇంటి ఎదుటున్న రేకుల షెడ్డు కింద నిల్చున్నాడు. రేకులషెడ్డుకు ఆనుకుని ఉన్న సర్వీస్‌వైర్ నుంచి గోడకు ఒరిగి నిల్చున్న రాకేశ్‌కు విద్యుత్‌షాక్‌తో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. రాకేశ్ భార్య లావణ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.