
● లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం ● జెడ్పీ మాజీ చైర్
రాయికల్: ఎస్సారెస్పీ నుంచి వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని అల్లీపూర్‌లోగల ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్నా.. రైతులు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క నాయకుడికీ చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కాలువలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుని రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేదని గుర్తుచేశారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ దొంతి నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎనగందుల ఉదయశ్రీ, నాయకులు రత్నాకర్‌రావు, మహేశ్‌గౌడ్, సాయికుమార్, మహేందర్, అనుమల్ల మహేశ్, జాన గంగాధర్, సాగర్‌రావు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయండి