
కొరడా
32.0/27.0
అబార్షన్ కిట్లపై
7
గరిష్టం/కనిష్టం
అసలేంటి ఈ అబార్షన్ కిట్లు
అబార్షన్ కిట్లను అబార్టిఫేసియంట్ డ్రగ్స్‌గా పిలుస్తారు. మెఫిప్రిస్టోన్, మీసోప్రోస్టాల్ తదితర టాబ్లెట్లు ఈ కిట్‌లో ఉంటాయి. వీటిని అవాంఛిత గర్భస్రావాలకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌షాపులపై డీసీఏ దాడులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా హుజూరాబాద్, జమ్మికుంట, సుల్తానాబాద్, సిరిసిల్ల, జగిత్యాల షాపులపై డీసీఏ దాడులు చేశారు. ఈ దాడుల్లో సిరిసిల్లలో ఓ మెడికల్ షాపును ఏకంగా మూసివేశారు. జగిత్యాల జిల్లాలో ఐదు షాపులు, పెద్దపల్లి జిల్లాలో మరో ఆరుషాపులకు అబార్షన్ కిట్లు విక్రయిస్తున్నందుకు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో జమ్మికుంట, హుజూరాబాద్‌లో స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధరణ పరీక్షలు చేయడం, అబార్షన్ కిట్లు వాడి గర్భంలోనే చిదిమేయడం అలవాటుగా మారింది. వాస్తవానికి వైద్యుల సమక్షంలో ఆసుపత్రుల్లోనే ఈ ప్రక్రియ జరగాలి. కానీ, వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎవరికి వారు, ఆసుపత్రుల బయట ఈ తతంగాన్ని నడపడం ఆందోళనకరంగా మారింది.
● ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా విక్రయాలు
● ఆడపిల్లలను కడుపులోనే చంపే మాత్రల అమ్మకాలు
● మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడులు
● జగిత్యాలలో 5, పెద్దపల్లిలో 6 షాపులకు షోకాజ్ నోటీసులు
● సిరిసిల్లలో ఒక షాపు మూసివేత
వెంటనే సమాచారమివ్వండి
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ఇలాంటి అబార్షన్ కిట్ల విక్రయం చట్ట విరుద్ధం. వాణిజ్య సముదాయాల్లో లేక నివాసిత ప్రాంతాలకు సమీపంలో ఎక్కడా ఇలాంటి అబార్షన్ కిట్లు విక్రయించినా వెంటనే డీసీఏ అధికారులకు సమాచారమివ్వండి. లేదా 18005996969కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా సమాచారమివ్వాలి. అలాంటి ఫార్మసీలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – షానవాజ్ ఖాసీం,
డైరెక్టర్ జనరల్, డీసీఏ
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఆడపిల్లలను అమ్మ కడుపులోనే చిదిమేసే అబార్షన్ కిట్లపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కొరడా ఝుళిపిస్తోంది. ఎలాంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా అబార్షన్ మాత్రలు విక్రయిస్తున్న పలు మెడికల్‌షాపులపై డీసీఏ అధికారులు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి.. అన్ని మెడికల్ షాపులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో ఒక షాపు అధికారులు మూసివేశారు. జగిత్యాలలో ఐదు, పెద్దపల్లిలో 6 షాపులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వైద్యుల సలహాలు లేకుండా మాత్రలు విక్రయిస్తే.. వాడిన వారికి అంతర్గత స్రావంతో పాటు ప్రాణాలు పోయే ప్రమాదముందని స్పష్టంచేస్తున్నారు. రోగుల ప్రాణాల మీద వస్తుందని తెలిసీ.. ఇష్టానుసారంగా జరుగుతున్న ఇలాంటి విక్రయాలపై డీసీఏ కొరడా ఝళిపించడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.
వాతావరణం ఆకాశం మేఘావృతం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రిపూట చలిగాలులు వీస్తాయి.
ఎంటీపీ చట్టం ఏ చెబుతుంది?
మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) 1971 చట్టం ఈ విధమైన గర్భవిచ్ఛిత్తి పూర్తిగా చట్టవిరుద్ధం. దీనికితోడుగా ఎంటీపీ 2002, 2003 నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 12 నుంచి 20 వారాలలోపు వయసున్న గర్భస్థ శిశువులో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. నిపుణులు, అనుభవజ్ఞులైన గైనకాలజిస్టుల సూచనల మేరకు వారి పర్యవేక్షణలోనే రాసిచ్చినపుడు అబార్షన్ కిట్లను విక్రయించాలి. అంతే తప్ప సరైన అనుమతులు లేకుండా.. ఈ తరహాలో విక్రయాలు చేపడితే ఎంటీపీ చట్టం 1971 ప్రకారం.. చట్టపరంగా రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతోపాటు భారీగా జరిమానా కూడా పడుతుంది.

కొరడా