
విద్యార్థులు.. ఇబ్బందుల‘పాలు’
మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలోని జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ఇతర పనులు చేయిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ దృశ్యం. రోజూ ఉదయం పాఠశాల వద్దకు వాహనంలో పాల ప్యాకెట్లు వస్తాయి. నిబంధనల ప్రకారం వాటిని ఆ బాధ్యత అప్పగించిన సిబ్బంది లెక్క చూసుకొ ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పాఠశాలలో వారికి బదులు విద్యార్థులతో ఈ పని చేయిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హెడ్‌మాస్టర్ ఔదార్యం
● పాఠశాల అభివృద్ధికి రూ.40 వేలు వెచ్చింపు
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): తాను పనిచేస్తున్న పాఠశాలలో అభివృద్ధి పనులు చేయాలనే సంకల్పంతో ఉపాధ్యాయురాలు ముందుకు వచ్చారు. మండలంలోని వేములకుర్తి మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఎం.గంగామణి రూ.40 వేలు వెచ్చించి పాఠశాలకు సున్నం, కలర్స్, పిల్లల కోసం బొమ్మల ఆర్ట్ వేయించారు. ఈసందర్భంగా శుక్రవారం హెచ్‌ఎంను ఆర్‌ఎంపీ, పీఎంపీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పెంట లింబాద్రి, గ్రామస్తులు సన్మానించారు. హైస్కూల్ హెచ్‌ఎం సారంగపాణి, ఎస్సీ కాలనీ పాఠశాల హెచ్‌ఎం శంకర్, ఎస్‌ఎంసీ చైర్మన్ భవాని, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గుమ్మల గంగన్న, ఆలయ కమిటీ చైర్మన్ నాంపెల్లి వెంకటాద్రి, గ్రామస్తులు బక్కి నవీన్, కోట రామానుజం, మగ్గిడి రవి, బుర్రి ముత్యం, రెడ్డవేని లక్ష్మీనర్సయ్య, బెజ్జరపు శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలుంటే అధికారులకు చెప్పాలి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రంలో లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌కో మెట్‌పల్లి డీఈ మధుసూదన్ పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో రెండు చోట్ల రూ.10 లక్షలు వెచ్చించి 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు. వినియోగదారులు ఏమైనా విద్యుత్ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏడీఈ రఘుపతి, ఏఈ దివాకర్‌రావు, సబ్ ఇంజినీర్ నవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పంట విస్తీర్ణం ఆధారంగా ఎరువులు విక్రయించాలి
మల్లాపూర్(కోరుట్ల): పంట విస్తీర్ణం ఆధారంగా రైతులకు ఎరువులు విక్రయించాలని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు సిరిపూర్, చిట్టాపూర్, ముత్యంపేట సహకార సంఘాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయ కేంద్రాల రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. రైతులు అధిక ధరలకు ఎరువులు కొనకుండా సహకార సంఘాలు, లైసెన్స్‌డ్ డీలర్ల వద్ద కొనాలని సూచించారు. పీవోఎస్ మిషన్ ద్వారా ఎరువులు అమ్మాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్‌పల్లి క్లస్టర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.శ్రీనివాస్, సీనియర్ ఇన్‌స్పెక్టర్ నిజాముద్దీన్, ఫ్యాక్స్ సీఈవోలు రమేశ్, రాజేశ్వర్‌రెడ్డి, రవితేజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు.. ఇబ్బందుల‘పాలు’

విద్యార్థులు.. ఇబ్బందుల‘పాలు’