
పనుల్లో నాణ్యత పాటించండి
కథలాపూర్/కోరుట్లరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తాండ్య్రాల గ్రామంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్రం భవనం పనులు, పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. ఉపకేంద్రం భవన పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. అలాగే కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి–మేడిపెల్లి మండలం కట్లెకుంట మధ్య వాగుపై నిర్మించిన హైలెవల్ వంతెన, రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు పనులు చేస్తున్న క్రమంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో కోరుట్ల ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, పీఆర్ ఈఈ లక్ష్మణ్‌రావు, గృహానిర్మాణశాఖ పీడీ ప్రసాద్, తహసీల్దార్లు వినోద్, కృష్ణచైతన్య, ఎంపీడీవోలు శంకర్, రామకృష్ణ కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్