
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్ ఆధ్వర్యంలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. మంత్రితోపాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఉలుకుపలుకు లేదన్నారు. సామాజిక వర్గం బాగుకోసం అందరం కృషి చేయాలే తప్ప ప్రజల ఆగ్రహాలకు గురికావద్దని సూచించారు. బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదని, బీసీలకు బీఆర్‌ఎస్ చేసిందేమిటో చెప్పాలని ఎమ్మెల్సీ అద్దంకి డిమాండ్ చేశారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనిల్, మినరల్ డెవలప్‌మెంట్ చైర్మన్ అనిల్, రుద్ర సంతోష్, నాయకులు తదితరులున్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ చారిత్రకం