
వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్
జగిత్యాలటౌన్: సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్న వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, అందులో భాగంగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 42శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపి వంద రోజులు దాటిందని గుర్తు చేశారు. కేంద్రం తాత్సారం చేస్తుండటంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంలోని తమ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలన్నారు. ఏ బిల్లుౖపైనెనా మూడు నెలల్లో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకుంటే అది అమలు అయినట్టేనన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, గాజంగి నందయ్య, ధర రమేష్, పిప్పరి అనిత, ముంజాల రఘువీర్, గుండ మధు, లైశెట్టి విజయ్, నేహాల్ తదితరులు ఉన్నారు.