
అసంపూర్తిగా వంతెన పనులు
రాయికల్: మండలంలోని రామాజీపేట బతుకమ్మ వాగు, మైతాపూర్ గ్రామాల మధ్య హైలెవల్ వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో వర్షకాలంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైతాపూర్ వంతెన నిర్మాణం కోసం రూ.2.91 కోట్లు, రామాజీపేట వంతెన నిర్మాణం కోసం రూ.1.40 కోట్లు మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాకపోవడంతో రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణానికి సైడ్‌వాల్స్, బీటీరోడ్డు నిర్మాణం వంటి పనులను నిలిపివేశారు. చేసిన పనులల్లో సైతం నాణ్యత లోపించడంతో కంకర తేలుతోంది. ఈ వంతెన మీదుగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తరుచూ ప్రయాణం చేస్తున్నా.. పనులపై మాత్రం చొరవ చూపించడం లేదని ప్రజలు అంటున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి యుద్ధప్రతిపాదికన అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వాహనదారులకు ఇబ్బందులు
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు

అసంపూర్తిగా వంతెన పనులు