
‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం పెంచాలి
మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టాలని, వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్‌లో నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. గడువులోపు నిబంధనల మేరకు పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇబ్బందులున్నాయా అని ఆరా తీశారు. గ్రామపంచాయతీ, హెల్త్ సబ్ సెంటర్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సాతారం, సిరిపూర్‌లో పర్యటించారు.
‘పది’ ఫలితాల్లో జిల్లా ముందుండాలి
పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలిపేలా విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సాతారం పాఠశాలలో విద్యాబోధన, డిజిటల్ తరగతులపై అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన బోధన అందించాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, ఎంపీవో జగదీష్ పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్