
గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్
కొడిమ్యాల: కొడిమ్యాల మండలంలోని అప్పారావుపేట సమీపంలో అనుమానాస్పదస్థితిలో కనిపించిన ఓ యువకుడిని ఎస్సై సందీప్ తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద తనిఖీలు చేయగా.. 125 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని పూడూరు గ్రామానికి చెందిన మొట్ట రమేశ్‌గా గుర్తించారు. నాగపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు నిందితుడు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
గ్రూప్స్‌కు ఉచిత శిక్షణ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్– 1, గ్రూప్– 2, గ్రూప్– 3, గ్రూప్– 4, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ల పరీక్షలకు ఉచిత కోచింగ్‌ను ఆగస్టు 25నుంచి ప్రారంభించనున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మంతెన రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 150 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కోచింగ్‌లో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.1000 స్టైఫండ్ అందిస్తామన్నారు. అర్హులైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా (జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్) నిరుద్యోగ భ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో ఈ నెల 16 నుంచి ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తల్లిదం డ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కలిగి ఉండాలన్నారు. డిగ్రీలో అత్యధికశాతం మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక విధానం ఉంటుందన్నారు. వివరాలకు ఫోన్ నంబరు 0878–2268686ను సంప్రదించాలని సూచించారు.
బైక్ నుంచి రూ.లక్ష చోరీ
సుల్తానాబాద్(పెద్దపల్లి): బైక్‌లో ఉంచిన రూ.లక్ష నగదును దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గట్టెపల్లి గ్రామానికి చెందిన బండ నర్సయ్య సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్పీఐ నుంచి రూ.లక్ష డ్రా చేసుకున్నాడు. ఆ సొమ్మును బైక్‌లో పెట్టుకుని ఫెర్టిలైజర్ దుకాణంలో యూరియా కొనుగోలు చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి పెట్రోల్ పోయించాడు. ఆయా ప్రాంతాల్లో ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేశాడు. అయితే, యూరియా కొనుగోలు చేసే సమయంలో తన ద్విచక్ర వాహనం కొంతదూరంలో ఉందని, ఇంటికి వెళ్లి అప్పు తీర్చేందుకు వాహనంలోంచి డబ్బులు తీసేందుకు యత్నింగా కనిపించలేదని బాధితుడు లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు సంప్రదిస్తే.. సీసీ ఫుటేజీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్