
చిన్నారిపై అఘాయిత్యం?
తిమ్మాపూర్: రేణికుంట గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై గుర్తుతెలియని వ్యక్తి అఘాయిత్యానికి యత్నించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. గుర్తుతెలియని వ్యక్తి సమీపంలో ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. బాలిక కేకలు వేయడం, పక్కనే ఉన్న ఆమె అన్న కూడా అరవడంతో చుట్టుపక్కలవారు అక్కడికొచ్చారు. దీంతో అగంతకుడు బాలికను వదిలేసి పరారయ్యాడు. చుట్టుపక్కలవారు పట్టుకునే ప్రయత్నం చేసినా దొరకలేదు. ఆ అగంతకుడు గ్రామస్తుడా లేక సమీప రైస్‌మిల్లులో పని చేసే వ్యక్తా అనేది బాలిక గుర్తుపట్టలేకపోతోంది. బాలికను కిడ్నాప్ చేయడానికి లాక్కెళ్లాడా లేక అత్యాచారానికా అనేది తెలియడం లేదు. అయితే బాలిక కుటుంబం పేదవారు కావడంతో కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని, అత్యాచారం కోసమే లాక్కెళ్లాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌ని ఈ ఘటనపై వివరణ కోరగా.. విచారణ చేస్తున్నామని, ప్రాథమికంగా కిడ్నాప్ కోసం ప్రయత్నాలు చేసి ఉండొచ్చని అన్నారు.
అత్యాచారమా? కిడ్నాప్‌నకు యత్నమా?

చిన్నారిపై అఘాయిత్యం?