
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
● డీఈవో రాము
జగిత్యాల: ఆన్‌లైన్ మోసాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఈవో రాము అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యార్థులకు కామిక్ రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైటెక్ యుగంలో సైబర్, అబ్యూస్, ఆన్‌లైన్ గేమింగ్‌తో మోసాలు చోటుచేసుకుంటున్నాయని, వీటిపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కామిక్ రచన పోటీలను సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. రంగపేటకు చెందిన భవిత ప్రథమ, రాఘవపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థిని ధనలక్ష్మీ ద్వితీయ, ధర్మపురి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి హర్షవర్దన్‌కు మూడో బహుమతి అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయాధికారి కొక్కుల రాజేశ్ ఉన్నారు.