
కానరాని ‘చెత్త’శుద్ధి
● బయోమైనింగ్ ఉన్నాట్లా.. లేనట్లా..? ● ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త ● ఇబ్బంది పడుతున్న ప్రజలు
చేయని బయోమైనింగ్
డంపింగ్‌యార్డు సమీపంలో ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో బయోమైనింగ్ ప్లాంట్ నిర్మించేందుకు టెండర్లు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో టెండర్ ప్రక్రియ చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో నిర్మల్‌కు చెందిన ఓ ఏజెన్సీ వారు దక్కించుకున్నారు. దాదాపు రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ బయోమైనింగ్ పూర్తిస్థాయిలో చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల మున్సిపాలిటిలో రోజుకు సుమారు 60 టన్నుల చెత్త వెలువడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో తడి 20 టన్నులు, పొడి చెత్త 15 టన్నులు, హజోర్డస్ 4 టన్నులు, శానిటరి వేస్ట్ టన్ను, మిక్స్‌డ్ వేస్ట్ 20 టన్నులు వెలువడుతుందంటున్నారు. డంపింగ్‌యార్డులో టెండర్ పూర్తయినప్పటి నుంచి బయోమైనింగ్ ప్రారంభమైనప్పుడు 1,44,692 టన్నుల చెత్త ఉంటే బయోమైనింగ్ ద్వారా 89 వేల టన్నులు బయోమైనింగ్ చేయగా.. ఇంకా 44 శాతం ఉంది. ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు. బయోమైనింగ్ పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 కోట్లు వెచ్చించినప్పటికీ పూర్తిస్థాయిలో కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు నిత్యం 60 టన్నులు వెలువడుతుండడంతో బయోమైనింగ్ చేయకపోవడంతో ఇంకా పేరుకుపోతూనే ఉంది. గతంలో టెండర్ పొందిన వారు 44 శాతం చేయాల్సి ఉంది. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో బయోమైనింగ్ చేపడితేనే ఇబ్బందులు ఉండవని పేర్కొంటున్నారు.
బయోమైనింగ్‌పై ఆరోపణలు
బయోమైనింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రూ.5 కోట్లు వెచ్చించినప్పటికీ పూర్తిస్థాయిలో కాకపోవడమేంటని ప్రశ్నించారు. వాస్తవంగా బయోమైనింగ్ చేశాక అందులో వెళ్లిన సన్నపు మట్టిని వ్యవసాయదారులు, ప్లాస్టిక్ గ్లౌస్‌లు, ఇతర ఫ్యాక్టరీలకు తరలించాల్సి ఉంటుంది. అలాగే సీఎన్జీ వేస్ట్ (మట్టి, గోడలకు సంబంధించిన) మున్సిపాలిటీలో ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ పోయాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులే పేర్కొంటున్నారు. కానీ అది మచ్చుకు కన్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. బయోమైనింగ్ ద్వారా చెత్త నిల్వలను కనుమరుగు చేయాలని అధికారులు భావించినా.. సమస్య తీవ్రతరంగా మారింది.
కాలుష్య కోరల్లో కాలనీలు
డంపింగ్‌యార్డుల్లో నిత్యం పొగలు అంటుకుని ఆ కాలలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం చెత్తను కాల్చకూడదు. ఆ పొగ వస్తే మనుషుల గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. మనుషుల ఆరోగ్యంతోపాటు పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాల్లో పీఎం 2.5, పీఎం 10 నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్ యాకై ్సడ్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. నర్సింగాపూర్ ప్రాంతంలో డంపింగ్‌యార్డు వద్ద డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, న్యాక్ కేంద్రాలు ఆనుకునే ఉండటం, ఆ డంపింగ్‌యార్డులో బీడీ, సిగరేట్ పడేస్తున్నారో.. ఇతర కారణాలతోనో తెలియదు కానీ నిత్యం మంటలు అంటుకున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. స్పందించలేదు.
జిల్లాకేంద్రంలో నిత్యం
వెలువడే చెత్త : 60 టన్నులు
తడి చెత్త : 20 టన్నులు
పొడి చెత్త : 15 టన్నులు
హజోర్డస్ : 4 టన్నులు
శానిటరి వేస్ట్ : టన్ను
మిక్స్‌డ్ వేస్ట్ : 20 టన్నులు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని డంపింగ్‌యార్డులో చెత్త పేరుకుపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణ శివారులోని నూకపల్లి ప్రాంతంలో చెత్త పడేసేందుకు డంపింగ్‌యార్డును ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేయాలని అవగాహన కల్పిస్తున్నా.. ఆశించిన మేరకు ఫలితం కనిపించడం లేదు. తడి, పొడి చెత్త వేరు చేయాలని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ డంపింగ్ యార్డుల్లో పడేయడం, దానికి అగ్గి రాజుకోవడంతో అటు పొగ, ఇటు దూళి సమస్యతో ఆ సమీపంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌యార్డులో ఉన్న కంపోస్ట్ ఫిట్లుగానీ, పొడి వనరుల కేంద్రంగానీ, నిరుపయోగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డంపింగ్ యార్డులో పొడి వ్యర్థాలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు కాలుష్యం, దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు.

కానరాని ‘చెత్త’శుద్ధి

కానరాని ‘చెత్త’శుద్ధి

కానరాని ‘చెత్త’శుద్ధి

కానరాని ‘చెత్త’శుద్ధి