
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చీర్లవంచలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. చీర్లవంచకు చెందిన గంగు శ్రీనివాస్ (22) మద్యానికి బానిసై ఏ పని చేయక తిరుగుతూ ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామ శివారులోని డంపింగ్ యార్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు.
అనారోగ్యంతో వృద్ధురాలు..
ఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లి గ్రా మానికి చెందిన కాటిపల్లి అమృతమ్మ(70) అ నారోగ్యంతో జీవితంపై విరక్తిచెంది వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇల్లందకు ంట ఎస్సై క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. అ మృతమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు మంగళవారం చుట్టుపక్కల వెతుకుతుండగా.. గ్రామశివారులోని ఓ వ్యవసాయబావిలో మృతదేహం లభించింది. త నతల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, జీవి తంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని అమృతమ్మ కొడుకు రవీందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో నాలుగు సోలార్ పవర్ ప్లాంట్లు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా స్వశక్తి సంఘాలు, రైతులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సా హం అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు ముందుకు రావడంతో నాలుగు చోట్ల ఏర్పాటుకు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. అందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి హద్దులు నిర్ణయించడంతో పనులు చేపట్టారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట సహకార సంఘం ఆధ్వర్యంలో రాఘవాపూర్‌లో ఒకటి, మండల కేంద్రమైన కాల్వశ్రీరాంపూర్‌లో మరోటి, మంథని మండ లం గుంజపడుగులో ఇంకోటి, ధర్మారం మండలం దొంగతుర్తిలోనూ సహకార సంఘం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుగుణంగా స్థలాల చదును పనులు ప్రారంభించారు.
రెడ్కో నోడల్ ఏజెన్సీ పర్యవేక్షణలో..
జిల్లాలో ఏర్పాటు సోలార్ పవర్ ప్లాంట్ల పనులు టీజీ రెడ్కో నిర్మాణ సంస్థ పర్యవేక్షణలో జరగనున్నాయి. తక్కువ ఖర్చుతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలపై నివేదిక అందించాలని ఇటీవల జరిగిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణకు ఒప్పందం చేసుకునేందుకు పకడ్బందీగా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఒక్కో మెగావాట్ ఉత్పత్తి లక్ష్యం..
పీఎం కుసుమ్ పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్‌ను దాదాపు నాలుగెకరాల స్థలంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోలార్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్‌కు విక్రయించి ఆదాయాన్ని ఆర్జించనున్నట్టు జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల తెలిపారు.

మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య