
భక్తులకు సదుపాయాలు కల్పించండి
సారంగాపూర్: ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరున్న దుబ్బరాజన్న ఆలయంలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కృషిచేస్తానని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ద్వారా ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేయిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అనూష, పాలకవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీగా వెంకటేశ్వర్‌రావు
మెట్‌పల్లి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రావులపల్లి వెంకటేశ్వర్‌రావు ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందారు. బుధవారం కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్‌గా కళాశాలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ చిలకమారి శ్రీనివాస్, సీనియర్ ఉపన్యాసకులు కొక్కుల గంగాధర్ తదితరులున్నారు.
లేబర్ కోడ్‌ల అమలు నిలిపివేయాలి
జగిత్యాలటౌన్: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాలు లేని దేశాన్ని పెట్టుబడిదారులకు బహుమతిగా ఇవ్వడమే కేంద్ర ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. లేబర్ కోడ్‌ల ద్వారా ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్‌ను చట్టబద్ధం చేసి రెగ్యులర్ ఉద్యోగుల భద్రతకు ముప్పు తెచ్చిందన్నారు. ఏఐటీయూసీ నాయకులు ఎండీ.ముక్రం, సుతారి రాములు, సీఐటీయూ జిల్లా కన్వీనర్ పుప్పాల శ్రీకాంత్, ఇందూరి సులోచన, కోమటి చంద్రశేఖర్, చింత భూమేశ్వర్, మెయిజ్ భాయ్, ఖాజా మొయినుద్దీన్, లక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్, మల్యాల సురేష్ తదితరులు ఉన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
జగిత్యాలరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో మహిళాశక్తి సంబరాలు నిర్వహించారు. మహిళాసంఘాల్లో చేరని వారుంటే గుర్తించి చేర్పించాలన్నారు. 16నుంచి 18 ఏళ్లలోపున్న బాలికలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను ప్రత్యేక సంఘాల్లో చేర్పించాలన్నారు. సదరం ధ్రువీకరణ పత్రం ఉన్న దివ్యాంగుల సంఘాన్ని నాలుగు రకాలుగా విభజించాలని సూచించారు. వడ్డీ లేని రుణాలు, మైక్రోఎంటర్‌ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాడి గేదెల యూనిట్లకు రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఏపీవో ఓదెల గంగాధర్, సీసీ గంగారాం, వీవోఏలు విజయ, పావని, అధ్యక్షురాలు మానస, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు సదుపాయాలు కల్పించండి

భక్తులకు సదుపాయాలు కల్పించండి

భక్తులకు సదుపాయాలు కల్పించండి