
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి
● గోదావరి పుష్కరాలకు ధర్మపురి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతా ● రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల కొరత రానీయం ● ‘దిశ’ కమిటీ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాల: జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గోదావరి పుష్కరాల వరకు ధర్మపురి క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా అభివృద్ధి (దిశ)పై సమీ క్షించారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయంపై అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. జిల్లాలో అధిక శాతం మంది వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారని, సా గునీటికి ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ అధి కారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఎరువుల కొరత రానీయొద్దని, అధికా రులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎంతో మాట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. కొత్త డిగ్రీ కళాశాల, స్టడీ సర్కిల్‌కు నిధులు మంజూరు చేస్తానన్నారు. జగి త్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడు తూ.. కొండగట్టు అంజన్న ఆలయంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ కళా శాలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. మ న ఊరు – మన బడి కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు మంజూ రు చేయాలని కోరారు. వర్షకాలం నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వరద డ్యామేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ జగిత్యాలలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద సౌకర్యాలు కల్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కొత్తబస్టాండ్ నుంచి పాతబస్టాండ్ వర కు రోడ్డు వెడల్పు చేయాలన్నారు. ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వజ్రోత్సవాలు నిర్వహించేలా చూడాలన్నారు. అన్ని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కా ర్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు క లెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.