దుర్గంధ భరితం | - | Sakshi
Sakshi News home page

దుర్గంధ భరితం

Jul 10 2025 6:45 AM | Updated on Jul 10 2025 7:03 AM

మురికి

కూపం..

జగిత్యాల: జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. యావర్‌రోడ్‌ నుంచి కొత్తబస్టాండ్‌, తహసీల్‌ చౌరస్తా వరకు రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడో నిర్మించింది కావడంతో అక్కడక్కడ కూలిపోయింది. అందులోనే ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతరత్రా వస్తువులన్నీ పడేస్తున్నారు. వర్షం పడితే రోడ్డంతా చెరువును తలపిస్తోంది. సమీపంలోని షాపులు, ఇళ్లలోకి మురికినీరు చేరుతోంది. వర్షం తగ్గినా.. మురికినీరు మాత్రం ఎటూవెళ్లలేని పరిస్థితి. కొత్తబస్టాండ్‌ నుంచి వచ్చే డ్రైనేజీ తహసీల్‌ చౌరస్తా వద్ద మెయిన్‌రోడ్‌ రోడ్డ్‌ వద్ద మలుపు తిరుగుతుంది. అక్కడ గతంలో పైపులు వేశారు. అవి పూర్తిగా బ్లాక్‌ కావడంతోనే నీటి ప్రవాహం సరిగా సాగడం లేదంటున్నారు స్థానికులు. ఆ పైపులు తవ్వాలంటే యావర్‌రోడ్‌ను మూసివేయాల్సి వస్తుంది. దీంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

మురికినీటిలోనే సావాసం

యావర్‌రోడ్‌లో దాదాపు 50 నుంచి 70వరకు షాపులు, వెనుకవైపు ఇళ్లు ఉన్నాయి. మురికినీరంతా రోడ్డుపై నుంచి ఇళ్లలోకి చేరుతోంది. వర్షంపడితే బురద కొట్టుకొస్తోంది. బయటకు పంపిద్దామన్నా.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. వాసన భరించలేకపోతున్నామని, వంట చేసుకోలేక.. భోజనం తినలేక.. మరోచోటికి వెళ్లలేక అందులోనే కాలం వెల్లదీస్తున్నామని చెబుతున్నారు.ఈ సమస్యపై కలెక్టర్‌కు ప్రజావాణిలో కాలనీవాసులు, షాపుల నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. వారం గడిచినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు.

ఈ చిత్రం తహసీల్‌ చౌరస్తాలోని డ్రైనేజీ. నీరు నిలిచిపోయి సమీపంలోని మూడునాలుగిళ్లలోకి వెళ్తోంది. ఇంటి యజమానులు నీటిని తొలగించాలని చూసినా సాధ్యపడడం లేదు. భరించలేని దుర్గంధం మధ్యే కాలం వెల్లదీస్తున్నారు.

ఇంట్లో ఉండరాదు.. బయటకు వెళ్లరాదు ఎక్కడ చూసినా డ్రైనేజీ నీరే.. దుర్వాసన మధ్యే సహవాసం

రోగాల పాలవుతున్న ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు

ఇది యావర్‌రోడ్‌లోని ఓ ఇంటి ఆవరణ లోకి చేరిన మురికినీరు. మురికికాలువలన్నీ బ్లాక్‌ కావడంతో ఎటూ వెళ్లక ఇక్క డే నిలిచి ఉంటోంది. భారీ వర్షం పడితే నీరు ఇంటి లోపలికి చేరుతోందని ఆ ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్‌. సమీపంలోని డ్రైనేజీని

శుభ్రం చేయకపోవడంతో అక్కడకక్కడ కూలిపోయింది. కాలువ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయింది. మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో సమీపంలోని షాపులు, ఇళ్లలోకి చేరుతోంది. ఆ వాసన భరించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీని శుభ్రం చేయాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు.

ఉండలేకపోతున్నాం

నేను బుక్‌స్టాల్‌ పెట్టుకున్నాను. వాస్తవానికి యావర్‌రోడ్డు రద్దీ ప్రాంతం. ప్రజలు చాలామంది రావాలి. కానీ.. దుర్గంధంతో ప్రజలు ఇక్కడికి రావడం లేదు. ఇప్పుడిక్కడ వ్యాపారం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. వర్షం పడితే మురికినీరంతా షాపులోకి వస్తోంది. మా పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అధికారులు స్పందించాలి.

– సతీశ్‌, జగిత్యాల

ఇది జిల్లాకేంద్రంలోని ఓ ఇల్లు. వారి ఇంటి సందులోకి వెళ్లాలన్నా.. బురద తొక్కుకుంటూ.. మురికినీరు దాటాల్సిందే. ఇంట్లో ఉన్నవారు బయటకు వెళ్లాలన్నా మురుగులోంచి నడవాల్సిందే. నీరంతా వంటగది, బెడ్‌రూంలోకి చేరుతుండడంతో ఇంట్లో ఉండలేకపోతున్నారు.

ఇక్కడ ఎటుజడ్‌ బజార్‌ షాపు ఉండేది. పాన్‌టేలాతోపాటు వివిధ షాపులున్నాయి. ఈ మురికినీరంతా షాపుల్లోకి వెళ్లడంతో భరించలేక మూసివేశారు. అత్యధిక రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మురికినీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్థానికులు రోగాల పాలవుతున్నారు. ఎటైనా ఓ వైపు మురికినీరు తరలించేలా చూడాలని షాపుల యజమానులు కోరుతున్నారు.

దుర్గంధ భరితం1
1/6

దుర్గంధ భరితం

దుర్గంధ భరితం2
2/6

దుర్గంధ భరితం

దుర్గంధ భరితం3
3/6

దుర్గంధ భరితం

దుర్గంధ భరితం4
4/6

దుర్గంధ భరితం

దుర్గంధ భరితం5
5/6

దుర్గంధ భరితం

దుర్గంధ భరితం6
6/6

దుర్గంధ భరితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement